కాలమా

కాలమా,
కన్నీటి చుక్కల్లే జారి కరిగిపోకు,
కన్నుల్లో కలలున్నాయి,
కనురెప్పల మాటున వ్యధలున్నాయి,
కనుసన్నల్లో ఆశలున్నాయి,
కనుమూసేలోపు కాగల కార్యాలెన్నో ఉన్నాయి,
సమయమా కాస్త సహకరించు,
ఎప్పుడూ నీ వెనుక పరుగులేనా?
అప్పుడప్పుడూ మనసు మాట విననీ,
సేద తీరనీ,
శక్తిని సమకూర్చుకోని,
సమరంలో విశ్రాంతా అని ఎగతాళిగా నవ్వకు,
నిష్క్రమించని  నిరంతర పయనంలో,
చలివేంద్రపు నీటిని గుక్కేడన్నా తాగనీ,
అరుగుపై అరక్షణమన్నా వాలనీ,
సాటి బాటసారులతో కష్టసుఖాలు పంచుకోని,
కాలమా,
సాకిలపడి వేడుకోవట్లా,
ఎదురునిలిచి నిలదీయట్లా,
కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం