ఘర్షణ-సంఘర్షణ
జీవితం ఓ ఘర్షణ, సంఘర్షణ...
నిన్నటి ఆలోచనలకు,
రేపటి ఆచరణకు,
నడుమ నేడు ప్రణాళికల ఘర్షణ.
నిన్నటి నిరాశకు,
రేపటి ఆశకు,
నడుమ నేడు సంకల్పాల సంఘర్షణ.
నిన్నటి ప్రశ్నకు,
రేపటి సమాధానంకు,
నడుమ నేడు అన్వేషణల ఘర్షణ.
నిన్నటి తప్పుకు,
రేపటి పశ్చాత్తాపానికి,
నడుమ నేడు ఆత్మవిమర్శల సంఘర్షణ.
నిన్నటి పనికి,
రేపటి ఫలితానికి,
నడుమ నేడు నిరీక్షణల ఘర్షణ.
ఈ ఘర్షణ, సంఘర్షణల రాపిడితో,
రాజుకున్న అగ్గి వెలుతురులో,
రేపటి కోసం వెతుకుతున్న,ఆశే నేడు
నిన్నటి రేపటిల నడుమ నలిగిన నిజమే, నేడు..!
శుభరాత్రి.
అడుసుమల్లి రవికుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి