ఆలోచన
నా ఆలోచనల మహాప్రవాహంలో,
నేనో నీటి బిందువును,
ఉధృతంగా ఉప్పొంగే ఓ నాడు,
ప్రశాంతంగా సాగే మరో నాడు,
ఓ ఆలోచనలో శోధన,
మరో ఆలోచనలో వేదన,
ఆ శోధనలో,వేదనలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ..
మనసు గర్భంలో శిశువునై,
ఊహల ఉమ్మనీటిలో తేలియాడుతూ,
ఊసులాడే గుండె లయకు తలాడిస్తూ,
అనుభవాల రక్త ప్రసరణ ఘోషలో,
అనుభూతులను వెతుక్కుంటూ,
ఆత్మవిమర్శల గర్భద్వారంలో నలిగిపోతూ,
ఏకాంతంలో,
మరోసారి జన్మిస్తూ,
పసిపాప స్వచ్ఛత లో మలచుకుంటూ
...ఆలోచిస్తూ నాలో నేను నాకై నేను.!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి