పోరాటం చెయ్

శుభోదయం

ప్రచండమైన ఆరంభం చెయ్
యుద్ధ భేరిని మోగించెయ్
సంకల్పమే విల్లుగా
ధర్మమే వింటి నారి గా
ధన మాన ప్రాణాలే బాణాలుగా
సర్వ శక్తియుక్తులతో
కదన రంగాన దూకేయ్ ...

మందలో మేక లా కాక
నలుగురికి నాయకుడి గా
ఒంటరి అయినా సరే
స్వప్నమే భయ పెట్టినా సరే
శొక సముద్రాలే రానీ
సప్త సముద్రాలే ఉప్పొంగనీ
పట్టు సడలనీయకు
దృష్టి మరల్చకు....

ఏ చరిత్ర చదివినా
పాండవ కౌరవ కురుక్షేత్ర
మహాభారత గీతా పారాయణ చేసినా
సారము ఒక్కటే.!
యుద్ధం అనివార్యం అని
అదే యోధుని వీర్యం అని
లక్షణం అని లక్ష్యం అని..

గెలుపులోని స్థైర్యమా
ఒటమిలోని నైరాస్యమా
చేతకానితనపు నిస్తేజమా
నిర్ణయం నీదే మిత్రమా..

ఓటమి అన్న ఆలోచననే కాల్చెయ్
భయాలు అన్ని అగ్ని లొ రాజేయ్
ధీరునివై సురునివై
అడుగు ముందుకి వెయ్
వెను తిరిగి రాని
ఒక నూతన బాట ను నిర్మించెయ్....!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం