నేనే.. కాలాన్ని

సూర్యుడు చంద్రుడు.. 
నా బంట్రోతులు నా ఆనవాళ్ళు 
నా పలకరింతల నకళ్ళు 
పున్నమి రాత్రి కురిసే వెన్నెలంతా  నా పరవశమే
అమావాస్య రోజు నక్షత్రాలు నా అక్షరాలే

నానుంచి దాక్కోవాలంటే నువ్వు......  
చీకటి వెలుగులు లేని చోటు వెతుక్కోవాలి 
దొరుకుతుందా మరి ఆ చోటు నీకు?

నిన్ను యజమానిగా చేస్తా ఓ రోజు
సేవకుడిగా మార్చుతా మరో రోజు
బండ్లు ఓడలు గా ఓడలు బండ్లు గా చేయడం నాకు మాత్రమే తెలిసిన విద్య

నీదనుకున్నది తన్నుకుపోతాను,
కాదనుకున్నది తెచ్చిపడేస్తాను,
ఏవి చేరాల్సిన చోటికి
వాటిని చేరుస్తూ
ఉదయమంతా తెల్లచీర
రాత్రయితే నల్లచీర కట్టుకుని
ఎగుడు దిగుళ్ళ రహదారి మీద
అలవోకగా పయనం సాగిస్తాను

రేపటిమీద ఆశ వీడద్దంటున్నా
నీకు అండగా నేనుంటా
విజయమే పొందుతావో,వీరుడిగా మిగులుతావో
ప్రేమనే పంచుతావో,గుర్తువై మిగులుతావో

జాగ్రత్త...నేను కాలాన్ని! 

~ అడుసుమల్లి రవి కుమార్


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం