నాన్న

మనం భూమ్మీద పడకముందే భగవంతుడు మనకోసం ఎత్తిన అవతారం నాన్న.

నాన్న ప్రేమ ఊట బావిలోని నీటి చలమ.
బిడ్డ బతుకును ఎప్పుడూ అది పొడారిపోకుండా కాపాడుతుంది.

నాన్న ప్రేమలోని మాధుర్యానికి అమృతం చిన్నబోయి స్వర్గానికి పారిపోయిందిట.

స్వీయ ప్రాణాలను సైతం బిడ్డలకోసం తృణప్రాయంగా సమర్పించేందుకు సదా సర్వసిద్ధంగా ఉండే పరమ త్యాగుల వరుసలో ముందుండేది నాన్నే.

ఎన్ని తరాలైనా మారనీ.. 
ఎంత ప్రగతిపథాన అయినా సాగనీ,
నాన్న నేర్పిన నడక నడత 
నాన్న అడుగుజాడలకు ఎడంగా జరగి పోరాదని తెలుసుకొంటే చాలు బిడ్డ బతుకంతా భద్రం.. బంగారం!

మబ్బులు కమ్మినప్పుడు సూర్యుడు, డబ్బులు లేనప్పుడు బంధువులు, 
శక్తి తగ్గినప్పుడు ప్రపంచం చులకన చేయవచ్చేమోగాని.. 
ఎప్పుడూ ఒక్కలాగే ప్రేమించేది మాత్రం నాన్నే! 

హిమాలయాలు దేశానికి ఉత్తరానే ఉన్నాయి.వాటిని మించిన ఉన్నత ప్రేమాలయాలు ప్రతీ ఇంటా నాన్నల రూపంలో ఉంటాయి. 
నాన్నల అనురాగం 
అరేబియా సముద్రం కన్నా వెడల్పైనది. 
బంగాళాఖాతంకన్నా లోతైనది.
హిందూ మహాసముద్రం వారి ప్రేమసింధువు ముందు పిల్లకాలువ!

నాన్న, నిజం నుండి జ్ఞాపకం గా మారేలోపు 
నాన్న ప్రేమ తెలుసుకో..నాన్న ఋణం తీర్చుకో!

సదా నాన్న జ్ఞాపకాలతో...,

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం