లోకం అనే లోలకం

క్రమం తప్పక ..
చీకటి - వెలుగులకి ఊయలలూపే అనాది మాతృత్వం .,
ప్రేమతో రహస్యంగా చెప్పిందొకమాట .!

లోకం అనే లోలకం
ఎప్పుడు మొదలైందో తెలీనట్లే
ఎప్పుడాగుతుందో కూడా తెలీదని
వెలుగువెంట చీకటి మల్లే - మనిషివెంట మనిషని ,

మరి ఈ యుగాల ప్రయాస దేనికోసమని ప్రశ్నిస్తే
" అరవిరిసే ప్రేమ కోసమ"ని బదులిచ్చింది .

రాళ్ళుతేలిన దారులు - ముళ్లతోవలు ,
రమణీయ బాటలు - రాజ మార్గాలు ,
అన్నీ వెళ్ళి అంత్యగమ్యంగా కలుసుకునే కూడలిని చేరినపుడు , 
ఏతోవన  వచ్చినవారు తమ వెంట ఏం తెచ్చుకున్నారోనని చూసాను  
అందరి చేతిలో ఉన్నవి " రిక్తపాత్రలే "

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం