స్నేహం

స్నేహమంటే …
అనుకోకుండా ఎదురయ్యేది
చివరివరకు నిలుచుండేది
ఎప్పటికి మరువలేనిది
ఎడబాటుని సహించనిది
అందరికి అనుభవం అయ్యేది
అందరిలో అనుభూతిని కలిగించేది
అపోహలను తెంచేది
ఆవేదనలో ఆదరణ అయ్యేది
బంధుత్వాన్ని మించేది
బంధాల్నిపంచేది
అదే…. స్నేహం …!
స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
వాడి పోతుంది
మంచుతో పోల్చకు
కరిగిపోతుంది
ఆకుతో పోల్చకు
రాలి పోతుంది
నీ నవ్వుతో పోల్చు శాస్వతం గా ఉండీ పోతుంది
సంతోషం లో..  సంపదలో...
కష్టాలలో.. కన్నీటిలో.
బాధలలో.. ఓదార్పు లో..
గెలుపులో... పిలుపులో..
ఓటమిలో.. ఓరిమిలో..
నాతో వుండి.. నాలో నిండి..
నన్ను నన్ను లా తీర్చిన నేస్తమా...
నీవే నా.. సమస్తం..
నీ సమక్షం... పరిష్కార గవాక్షం..
చీకటే లేని  అంతరిక్షం..
ప్రతి కృతి ఆకృతి లా.. మారి
నా మనో నేస్తం.. ఎదురుగా నిలబడితే...
రోజు లానే ఈ రోజు కూడా..  శుభోదయంలా...
వ్యక్తి లో వుండే స్నేహానికి....
శక్తి లా మార్చే యుక్తికి..సలాం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం