ఆత్మహత్య మహాపాతకం
ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా.......
'మనీ'షి గా మారిన ఓ మనిషీ, సాటివాడి గోడు వినరా!!
మాయమైన ఓ మనిషీ, మానవత్వంతో గుబాళించరా!!
ఆ రెండు కన్నీటి చుక్కలు
కనుకొనలలో వేళాడుతున్నాయి
వాలే భుజం లేక…..
ఆ రెండు మాటలు
నాలికను చిదిమేస్తూ
గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి
వినే మనసు లేక…..
ఆ విసుగు నిస్పృహై
శూన్యంలోకి జారిపోతుంది
ఆశకు ఆసరా లేక…..
ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ
మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది
హత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరో
తేల్చుకోలేని ప్రశ్నలను
మనకు వదిలేస్తూ…..
మనం
ఆ మనసులను
ఆ ఆ అంతరంగపు లోతులను తడమగలిగి
వారి ఆత్మలను ముద్దాడిఉంటే
ఒక మాట, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక సహానుభూతి, ఒక ఆశ….ఇచ్చివుంటే
ఎన్ని కొత్త చిగురులు తొడిగేవో కదూ ఆ జీవితాలు.
చిదిమేసుకున్న ప్రతీ జీవితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది…!!
మనసుకి మనిషి అండగా నిలబడితే 'ఆత్మహత్య' కు తావేలేదు....
ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోయిన ఆత్మీయులను గుర్తుచేసుకుంటూ..😪
-అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి