గెలుపు
రోజూ లాగే కాలం గడవదు
కొన్ని కాలనాగు వలయాలు
ఇంకొన్ని కాలకూట ప్రళయాలు
నువ్వు చూసేది, వినేది మాత్రమే నిజం కాదు
జననం లేకుండా… మరణం లేకుండా…
ఇంకొక మాయాలోకం పని చేస్తుంటుంది
అదృశ్యంగా!
నొప్పి లేని నిముషమేది..జనమైనా..మరణమైనా..
జీవితాన అడుగు ఆగునా..
నీరసించి నిలిచిపోతే..నిముషమైనా నీది కాదు...
బ్రతుకు అంటే..నిత్య ఘర్షణ.
ఊపిరుంది ఆయువుంది నెత్తురుంది..సత్తువుంది...
ఇంతకన్న సైన్యముండునా!!!
తనువంతా గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే..గెలుపంటే!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి