శుభరాత్రి
శుభరాత్రి
మల్లె పొదను
గాలి తట్టి లేపాక
తెల్ల మబ్బులు
ఎటో ఎగిరి వెళ్ళాక
.
మసక వెలుతురు
వీధి వాకిలి చేరాక
సందె మల్లెలు
మెడలు తిప్పి చూసాక
.
రాత్రి దీపాలు
నింగిన ముగ్గులేసాక
వెన్నెల్లో పూవుల
రేకలు మెరిసాక
.
ముక్కలైన నక్షత్రాలను
చొట్టబడ్డ చందమామను
మబ్బుల బండిలో పోసేసి
.
గువ్వలా రివ్వుమంటూఇంటిలోకి
జువ్వలా నిదుర ఒడిలోకి
చేరుకుని స్వప్నలోక సౌందర్యాన్ని పూసుకో మిత్రమా.!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి