పురుషులు

మగాడంటే మృగమే కానక్కర్లేదు
ఇంటి వెలుగుకై కరిగిన నాన్నా మగాడే !

మగాడంటే విషమే అయ్యి ఉండక్కర్లేదు
భయంలో భుజంపై ధైర్యమిచ్చిన
అన్న చెయ్యి మగదే .

మగాడంటే చీడపురుగే కాదు
తుంచి ఇచ్చిన హృదయానికి
కడదాక ఊపిరిచ్చిన ప్రియుడూ - భర్తా మగాడే .

మగాడంటే అవసరాన్ని అవకాశంగా
వాడుకునే ధగుల్బాజీయే కాదు
అవసరానికి తొలి పలకరింపుగా
నిలబడే మిత్రుడు మగాడే .

పురుషహంకారంతో మదమెక్కిన మకిలిని  పురుషులదినోత్సవం నాడైనా ఉతికి ఆరేయండి .
సమానత్వంలో స్త్రీని జీవితంలోకి తీసుకున్న వాన్ని
ఈ రోజైనా గుర్తించి హృదయంతో హత్తుకోండి !

పురుషాధిక్యతని వ్యతిరేకించే ముందు
దాన్ని అంగీకరించే స్త్రీలదీ ,
పురుషాధిక్య భావజాల రొచ్చేనని చెప్పండి .!

మగాడంటే వింత మనిషేం కాదని
ప్రకృతి మానవ సృజనలో ఓ సగమని
మనిషితనపు పూర్ణత్వానికి 
స్త్రీ వలె చెరిసగమని ఇద్దరికీ నేర్పండి .

హృదయపూర్వక
" అర్ధ మానవ " శుభాకాంక్షలు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం