కావాలి

ఇప్పుడంతా
పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం
ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే
ఆత్మవిమర్శలు చుట్టుముడితే
అస్తిత్వం ప్రశ్నిస్తే
మిగిలేదంతా అంధకారమే!

ఇప్పుడంతా పైపై పొరలలో అల్లుకున్న బంధాలే
లోతుల్లోకి తొంగి చూసే తీరికేది ఎవరికైనా ?
ఆత్మను తాకే స్పర్శ
మనసును హత్తుకునే కౌగిలి
కష్టం పంచుకునే హృదయం మృగ్యమే!

ఇప్పుడంతా చేతుల్లో మీటలు నొక్కే యాంత్రికతే
తినే తిండి, పిల్చే గాలీ లెక్కే
జీతాన్ని, జీవితాన్ని కంప్యూటర్ పెట్టెలో లాక్ చేసేసి
జీవాన్ని, ప్రాణాన్ని క్లికుల్లో లెక్కించేస్తున్నాం !
స్నేహం, బంధం, బంధుత్వాలన్ని కొనలకు వేలాడుతున్న ఆర్ధికతత్వాలే!

మాయమైపోతున్న మనిషిని ప్రత్యక్షం చేసే చేతలే కావాలిప్పుడు.!

--అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం