నేను

నేను....

తుఫాను గుప్పిట దాగిన సముద్రాన్ని
ఆకాశాన ఇంద్రధనుస్సుని

కాలాలు ఋతువులూ
పగళ్లు రాత్రులు
బాధలు కన్నీళ్ళు
ఆనందాలు నవ్వులు
మాట, మౌనం
అన్నింటా నేనే
నాతో నేనే....నాలో నేనే

ప్రశ్నని జవాబుని
గెలుపుని...ఓటమిని
ఓదార్పుని...లక్ష్యాన్ని
ఎన్ని జరిగినా
నాలోని నాతోనే
అవునన్నా నేనే...కాదన్నా నేనే

కలత చెందిన మనసుని
ఊరడించే స్పర్శని
ఓర్వలేని క్రోధాన్ని
మమతలూరే ప్రేమని
ఉనికికి సాక్ష్యాన్ని
అంతరిక్షాన్ని
సూర్యుడిని,చంద్రుడిని
నవగ్రహాలనూ నేనే..

నాకోసం
పోగేసుకుంటాను
రంగులు మారుస్తాను
హొయలు పోతాను
తలెగరేస్తాను
చివరికి...!!???
నలుగురు మోస్తేనే
మట్టిలో కలిసిపోతాను!!

"నేను" నాకోసమే కాదు
"నీ" కోసం కూడా...!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం