యువతా.....
యువతా...నిరాశాపూరిత ప్రవర్తన మార్చుకో..
అసలు అంతమే లేని ఒక లోతైన బావిలో ఎప్పటికీ నేలని తగలకుండా అలా పడుతూనే వున్నట్టు అనిపిస్తుందా?
ఏదో, ఎవరో, నిత్యం, నిరంతరం, నిన్ను ఆ చీకట్లలోకి గుంజుతూనే వున్నట్టు అనిపిస్తుందా? అయితే మంచిదే, ఈ భావం, ఈ భయం నీతో పాటు కోట్లమందికి వున్నదే.
మరి నీవు ఆచీకటిని చీల్చే దివిటీవి అవలేవా??
అవగలవు...
దానికోసం ఓ...గొప్ప వాళ్ళ చరిత్రలు తిరగేయాల్సిన అవసరం లేదు,
నాన్న తెచ్చే నెల జీతం సరిపోకపోయినా వంటింట్లో ప్రతి రోజు మూడు పూటలా భోజనం ఎలా తయారుచేస్తూ వుంటుందో అమ్మ నుండి నేర్చుకో,
పది సంవత్సరాల నుండి ఇంచుమించు అదే జీతంతో వున్నా, నిన్ను స్కూలు నుండి కాలేజికి, కాలేజి నుండి ఒక విశ్వవిద్యాలయం వరకూ ఎలా తీసుకువచ్చాడో మీ నాన్న నుండి నేర్చుకో. వాళ్ళూ మనుషులే, వాళ్ళకీ చీకట్లూ, బావులూ, అందులో పడిపోతున్నట్టు అనిపించడాలు వుంటాయి కాకపోతే మనలా ఏడ్చేసి ప్రకటించే గుణం వాళ్ళకి వుండదు.
ప్రేమ అని, ఫోను పగిలిపోయిందని,ఓటమని,పరీక్షలనీ, మీ హీరో సినిమా ప్లాపని,డబ్బులు సరిపోవట్లేదని......ఇలా నీకు నువ్వే బావిని సృష్టించుకొని, లేని గురుత్వాకర్షణ శక్తిని ఊహించుకుని కృష్ణబిలంలో పడిపోకు.
అణుచుకొని, అర్థం చేసుకొని, ముందడుగు వెయ్యి.
యువత శక్తే దేశ శక్తి..భారత్ మాతాకీ జై!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి