ఓయ్ అది చెప్పు ముందు


 పుడుతూ తల్లికి, పోతూ నలుగురికి శ్రమ ఎలాగూ ఇస్తావు ,

బ్రతికినంత సేపైనా చుట్టూ నా అనుకునే వాళ్ళు చెప్తున్న బాధా - చెప్పుకోలేని వ్యధా , కాస్త పట్టించుకుంటే,

పోయినపుడు చుట్టూ కూచునే మనుషులకి
ఏడుపు నటించే శ్రమ తప్పిస్తావు .
ఏం సాధించావో ? ఏం సంపాదించావో తరవాత .,
ముందు నీ మొత్తం జీవితానికి ముగింపులో
పక్కమనిషి కళ్ళలో రెండు చుక్కల కన్నీళ్ళని దాచిపెట్టావా ?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం