ఓ దేవా

ఓ దేవా

వసివాడని పువ్వుల నవ్యతను
మా నవ్వులకు ప్రసాదించు!

సూర్యకాంతి లోని ప్రయోజనత్వాన్ని
మా బుద్ధికి ప్రసాదించు!

వినీలాకాశపు విశాలత్వాన్ని
మా హృదయాలకు ప్రసాదించు!

మృగరాజు లాఘవాన్ని
మా లక్ష్య సాధనకు ప్రసాదించు!

పర్వత శిఖరపు ఉన్నతిని
మా ఆలోచనలకు ప్రసాదించు!

చెట్ల యొక్క సేవా భావాన్ని
మా కార్యాలకు ప్రసాదించు!

మధుర ఫలాల తియ్యదనాన్ని
కోకిల సుస్వరాన్ని
మా మాటలకు ప్రసాదించు!

నిర్గుణము సర్వ వ్యాపకము
ప్రేమమయము ఆనందకరము అయిన దైవ భావనను
మా లోకానికి ప్రసాదించు తండ్రి..!

శుభోదయం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం