రంగులు మారే లోకం

ఈ రంగులు మారే లోకంలో
ఏ రెండు రంగులు ఒకటికావు
ఒకదానికోసం మరొకటి మారదు.

అనునిత్యం సాగే సృష్టిలయలో
ఏ ఇరువురి రాతలు ఏకంకావు
ఒకరి గీతను ఇంకొకరు మార్చలేరు.

ఈ స్వార్ధపు అనిశ్చల జగతిలో
ఏ జతల భావాలు అతికిసాగవు
ఒకరి భావాలతో వేరొకరికి పనిలేదు.

అనురాగ ఆత్మీయతల లోగిలిలో
ఏ జంట మనసులు ఒకటికావు
ఒకరికి బదులుగా వేరొకరు చావరు.

ఈ అనంత జీవన పయనంలో
ఏ బాంధవ్యబంధాలు శాశ్వతంకావు
ఒంటరితనానికి ఎవరూ జతకూడలేదు.

అద్దంలో కనిపించే నీ బింబం
ఎక్కి ఎక్కి ఏడ్వనీయకు
ఇదొక మాయాలోకం నిజమెరిగి మసలుకో మరి

శుభోదయం
-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం