నేనొక భావ సంద్రాన్ని

నేనొక భావ సంద్రాన్ని...
తలపుల అలలెగసే సాగరాన్ని..!

తళుక్కున మెరిసే,
అక్షర నక్షత్రాల పాలపుంతల్ని,
జ్ఞాపకాల మబ్బుల చాటున,
దోబూచులాడే ఊహల జాబిల్లిని,
ఆరాధిస్తుంటాను.

ముత్యపు చిప్పవంటి నా చిన్నిగుండెలో,
పదిలంగా దాచుకున్న అనుభూతులను,
ఉద్వేగపు అలలపై ఊగే ఆలోచనలకు,
పసిడి అక్షరాల తళుకులద్దుతాను.

ఒక్క అక్షరం గుండె తలుపు తడితే,
ఒక్క భావం నిలువెల్లా స్పందింపచేస్తే,
చెమ్మగిల్లిన కళ్ళతో ఆవిరౌతాను.
ఆర్ద్ర మేఘాన్నయ్యి మౌనంగా వర్షిస్తాను,
అక్షరసరస్వతికి ఆగి మోకరిల్లుతాను.
వేణినై, వీణనై, వాణికి దాసోహమంటాను.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం