కాలం

కాలమెంత గొప్పది?

ఏ మలుపుల్లోనో పరిచయాలు చేస్తుంది,
ఏవేవో మనసుల్ని ముడివేస్తుంది,
ఏ దారుల్లోనో పయనింపజేస్తుంది,
జతకట్టాలని చూస్తే విడదీస్తుంది,

విడిపోవాలనుకుంటే కలిపేస్తుంది.
గుండె గాయలను మాన్పుతుంది,
మానిన గాయాలను రేపుతుంది,
చీకట్లో ఆశాకిరణాన్ని చూపుతుంది,

కాంతికి కారుమబ్బై కమ్మేస్తుంది,
బాధే కాదు ఆనందాన్నీ మింగేస్తుంది,
జీవితాలతో చెలగాటమాడుతుంది.
నాదనుకున్నది తన్నుకుపోతుంది,

కాదనుకున్నది తెచ్చిపడేస్తుంది,
ఆపదల్లో అమ్మై ఓదారుస్తుంది,
నిద్రపుచ్చి కలల్లో కనికట్టు చేస్తుంది,
రేపటిమీద ఆశ వీడద్దంటుంది,

అయినా,నీకు నేనున్నానంటూ నిలబడుతుంది.!!

-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం