ప్రళయం కాదు ఆరంభం

ఆరాత్రి,
నల్లటి మేఘం మనసంతా కమ్ముకుంది,
హృదయానికి చిల్లులు పడినట్టు,
బోరున కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి,
ఆశలు కొట్టుకుపోయాయి,
ఆలోచనలు విరిగిపడ్డాయి,
ప్రళయం ముంచెత్తిన భావన ……
ఆ మర్నాడు,
గోరు వెచ్చటి సూరీడి కిరణాలు మనసుని తాకాయి,
హృదయం నిర్మలంగా ఉంది ఆకాశంలా,
కడిగిన ముత్యంలా మెరిసిపోతోంది లోకమంతా,
చిగురాకు కొనన నిటి బిందువులా మెరుస్తోంది ఆశ,
సప్తవర్ణాల ఇంద్రధనస్సును ఎక్కుపెట్టాయి ఆలోచనలు,
ఆ రాత్రికి మర్నాడు,
ప్రళయం కాదు ఆరంభం…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం