Life should not be busy

“అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను”

“ఊపిరి పీల్చుకోవటానికి  కూడా టైం దొరకట్లేదు”

“లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్”

నిజమే…జీవితంలో కొన్ని కొన్ని దశలలో చాలా బిజీగా ఉంటాం.

నిజంగా… జీవితమంతా అంత బిజీగా ఉంటామా?? జీవించటానికే తీరిక లేనంత పనులా మనకి?!

నీకు టైం ఎలా దొరుకుతుంది?”, అని నన్ను ఎవరన్నా మెచ్చుకుంటే, అందులో గొప్పేముంది అని ఇబ్బందిగానూ…
”నీకు చాలా టైం ఉన్నట్టుందే!”, ఎప్పుడైనా వినిపించే ఎగతాళి పట్ల జాలిగాను ఉంటుంది.

అసలు టైం ఎందుకు ఉండదు? అలా ఉండకుండా ఎలా ఉంటుంది?

జీవితం వైవిధ్య భరితం, ఏ రంగు అందం ఆ రంగుదే. ఒకే రంగులో ఇరుక్కుపోకుండా అన్ని రంగులను ఆహ్వానించాల్సిందే.

ఉన్న సమయాన్ని ముక్కలు ముక్కలుగా విభజించేసి ఎదో ఓ ముక్కలో మనకు ఇష్టమైన వ్యాపకాలను సర్దేసుకోవాలి. Otherwise, life gets too dry.

నిఖార్సైన బద్దకిస్టునన్నా భరించొచ్చు, కానీ సర్వవేళ సర్వావస్థలలోనూ పొద్దస్తమానూ బిజీ బిజీ అనే బిజీయిస్టులను తట్టుకోలేం.!

ఈ మధ్య ఈ బిజీ గోల ఇద్దరిముగ్గురి దగ్గర విన్నాను.అందుకే ఈ పోస్ట్.!

చదివినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం