జీవితం
జీవితమంటే కదిలే నది
చైతన్యాన్ని అణువణువూ నింపుకున్న అంబులపొది
జీవితమంటే...
అనుభూతుల మాలిక...అనుభవాల వాహిక
ఆశల్నీ ఆశయాల్నీ చిత్రించుకుంటూ
కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు నడిచెయ్.!
పరిస్థితులకు ఎదురీది
మార్గం చూపే అంతర గవాక్షం నీ మనసైతే
జీవితమిక
స్వేచ్ఛా విహంగమే.!
కాలం ఎన్ని మానని గాయాల్ని సృష్టించినా
బ్రతుకు చిత్రం ఎంత విచిత్రంగా మారినా
గుండె లోతుల్ని తడిమి పునర్జన్మను ప్రసాదించేది గుప్పెడు ధైర్యమే.!
పడిలేచే కడలి తరంగంలా ప్రతినిత్యం ఎగిసిపడుతూ..
మన లోపలి లోతుల్ని
ఆర్ద్రంగా కొలుస్తూనే అనునిత్యం జీవించెయ్.!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి