ఆశ

కొలను ప్రతి రాత్రీ చంద్రుడినీ తారల్నీ
తనలో దాచుకుంటుంది
తడి ఆరిపోయాక తారలూ ఉండవు
వెలుతురూ ఉండదు
అంతా ఒట్టి కరడుగట్టిన మట్టి.!

సాగర తీరంలో మనం కూర్చున్నప్పుడు
సూర్యుడు వెనకాల నుంచి వెళ్ళలేక వెళ్ళిపోయాడు
మళ్ళీ పొద్దున్నే నీళ్ళలోంచి లేచేదీ మనల్ని చూడడానికే.!

నీవు నడుస్తున్న దారికి ద్వారాలు తెరుచుకున్నవి నీ గుండెలోనే
నీ దుఃఖగంగ సుడులు తిరుగుతున్నదీ ఆ చిట్టి గుండెలోనే
ప్రవాహ జడిలో కొట్టుకుపోతున్నది నీవు కాదు….
నీలోనే ప్రవాహం కొట్టుకుపోతోంది.!

మిత్రుడా…
నీలోని అడవులు, సెలయేళ్ళు, శిఖరాలు, లోయల మధ్య
నీవు ప్రయాణిస్తూనే ఉన్నావు కదా…..
వెళ్తూ ఉండు అలా ధ్యానంలా…
నువ్వు పువ్వై వికసించే క్షణం నీకోసం తప్పకుండా వస్తుంది.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం