లోటే లేదు
ఏ హడావుడి, మరే సందడి లేని నిశ్శబ్దంలో
గాలి సవ్వడి, ఆకుల గలగలలు...
ఆరు బయట నేనుకాక మరెవ్వరూ లేనట్టూ
చుట్టూ ఉన్న మనుషులూ, పరిస్థితులూ
ఉన్నఫళంగా ఉన్నవన్నీ మాయమయిపోయినట్టూ,
నన్ను నా ఆలోచనలలోనికి,..
నా ఆలోచనలు నా జ్ఞాపకాలలోనికి,..
నా జ్ఞాపకాల్లోని నన్ను
నేను ఆర్తిగా హృదయానికి హత్తుకోగలిగితే
నాకేమీ లేవన్న లోటు లేనేలేదుగా!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి