నాన్న
కన్న పేగు ప్రేమ అమ్మదైతే..
కను రెప్ప రక్ష నాన్నది.
అమ్మ ఒడి గుడి అయితే
నాన్న భుజం లోకాన్ని చూపే బడి.
అమ్మ జోల పాట ఎలాగో
నాన్న నీతి పాఠం అలాగ.
కాలం బాట మీద కనిపించని సాధకుడు నాన్న.
వాత్సల్యానికి ప్రతిరూపం నాన్న
మారుతున్న తరంలో "మీసాల అమ్మ" నాన్న
బిడ్డకి స్పూర్తి సంతకం నాన్న
బిడ్డల క్రమశిక్షణ పరిమళాలు నాన్న వేసిన వనంలోనివే
ఏ భయాన్నైనా దాటించే ధైర్యం నాన్న
ఏ ఆటంకాన్నైనా ఎదుర్కునేలా చేసే ఓ ధీమా నాన్న...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి