ప్లాస్టిక్ బాంబ్

సముద్రం  పోరాటానికి,  తిరుగుబాటుకు ప్రతీకగా కనిపిస్తుంది.
ఉత్సుంగ కెరటాలతో వర్థిల్లే సముద్రాన్ని చూసినప్పుడల్లా గొప్ప ఉత్సాహం కలుగుతుంది.
రాళ్లను వొరుసుకుంటూ మహా చైతన్యంతో కెరటాలు ముందుకు వస్తుంటే..
కాసిన్ని గవ్వలు ఒడ్డు ఒడిలోకి చేరుతుంటే ఆ అనుభూతిని ఎవరు మర్చిపోగలరు

సముద్రాలను నమ్మి
జీవిస్తున్న కోట్ల జీవులకు
ప్లాస్టిక్ సునామీ తాకిందా
నిన్నటి తిమింగలాల
గుంపు మరణాలకు కారణం?
గ్లోబల్ వార్మింగా ?
ప్లాస్టిక్ వార్నింగా?
సముద్రాలన్నీ రేపటి
ప్లాస్టిక్ పుష్పాలకు నెలవులు కానున్నవా

మొన్నటి స్వర్ణ యుగం ...
నిన్నటి లోహయుగం ....
నేటి ప్లాస్టిక్ యుగం ....
రేపటి నష్టాల యుగం ...
ఎల్లుండి కష్టాల యుగం .....
ప్లాస్టిక్ మానవుని మేధలోని మరో అణుబాంబు

ఇందుగలదందులేదను
సందేహము వలదు
ఎందెందు వెతికి చూచినా
అందందు కలదు
ప్లాస్టిక్ సర్వోపగతమ్ము .....

మానవత్వ మూలాలు
మునుగుతున్నవి ప్లాస్టిక్ మత్తులో
విశ్వ వ్యాప్తమైనది విచ్చలవిడి వాడకం టన్నులకొద్దీ ప్లాస్టిక్
పుట్టుకతోనే వ్యర్థమై ప్రకృతికి అనర్థమై
సముద్రం పాలై
ముంచుతున్నది పర్యావరణాన్ని

ప్లాస్టిక్ వ్యర్థాలు
పారిశుద్ద కార్మికుని గండాలు
మురుగు కాల్వల మూసివేసి
ముప్పుతిప్పలు పెడతాయి
పట్టణాలనే వరదల్లో ముంచుతాయి

ఇన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు
సముద్రమురికిగా  చేరినా
శుద్ది యంత్రాంగం కరవై
మిన్నంటుతుంది సముద్రఘోష
ఎవరికర్థమౌతుంది వేదనా భాష??

మురికి చేసి శుద్ది చేయుటేల
"అడుసు తొక్కనేల కాలు కడుగనేల "
సముద్ర మురికిని అరికడదాం
సముద్ర జీవజాతులను కాపాడుదాం ...!!

~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం