నీవే విజేతవు
విరిగిన అల
తిరిగి విశాల సముద్రమవుతుంది .
తిరిగి విశాల సముద్రమవుతుంది .
చెదిరిన కల
కఠోరవాస్తవాన్ని రుచి చూపిస్తుంది .
కఠోరవాస్తవాన్ని రుచి చూపిస్తుంది .
పగిలిన జీవితవిత్తు
కొత్త జీవమై మొలకెత్తుతుంది .
కొత్త జీవమై మొలకెత్తుతుంది .
దేహం గాలిని పీలుస్తున్నట్టే
జీవితం అణుక్షణం
అత్యవసరంగా ఆశని పీలుస్తుంది .
జీవితం అణుక్షణం
అత్యవసరంగా ఆశని పీలుస్తుంది .
ఎప్పుడైనా నిన్ను
లోకం తృణీకరిస్తే....సంఘం నిరాదరిస్తే
నీవు నిన్ను కావలించుకోగలిగితే
నీవే విజేతవు...కాదు కాదు జగజ్జేతవు!
లోకం తృణీకరిస్తే....సంఘం నిరాదరిస్తే
నీవు నిన్ను కావలించుకోగలిగితే
నీవే విజేతవు...కాదు కాదు జగజ్జేతవు!
~ అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి