వేలేంటి విడవటమేంటీ
వేలు విడిచినమేనమా, వేలు విడిచిన మేనత్త.... అని చెబుతూంటారు కదా!
ప్రస్తుత తరానికి అర్ధమవ్వదు ఇదేంటి వేలేంటి,విడవటమేంటి అని.ఎవరినీ అడగలేరు కూడా ఏమనుకుంటారో అని.. వారికోసమే ఈ వేలువిడిచిన అనే సంబంధాలకు అర్ధం ఇది :
వేలువిడిచిన మేనమామ,వేలు విడిచిన మేనత్త అని రెండు వరుసలవారున్నారు.
మేనమామ అంటే అమ్మకి అన్న,తమ్ముడు. ఈ వేలువిడిచిన మేనమామ అంటే అమ్మ యొక్క పెద్దమ్మ/పిన్నికొడుకు.
ఇక వేలు విడిచిన మేనత్త ఎవరూ?
తండ్రి అక్క/చెల్లెలు మేనత్త,
మరి ఈ వేలు విడిచిన మేనత్త మాత్రం తండ్రి యొక్క పెదనాన్న/బాబాయి కూతురు.
నిజానికి ఇవి వేలు విడిచిన మేనమామ,వేలు విడిచిన మేనత్త కాదు.....
వేలు విడవడం,వేలు మడవడం అసలే కాదు,
అసలు పేర్లు మేనువిడిచిన మేనమామ,మేను విడిచిన మేనత్త. ఇదేంటని కదా అనుమానం, చెబుతా, మేనమామ అంటే అమ్మమ్మ కొడుకు, అంటే ఇక్కడివరకు మేను(శరీరం) సంబంధం ఉంది, కాని ఈ మేను విడిచిన మేనమామ అమ్మమ్మకి అక్క/చెల్లెలి కొడుకు కదా.. అంటే సూటి సంబంధంకాదు,
ఇలాగే మేను విడిచిన మేనత్త కూడా.
తెనుగునాట చాలా పదాలు అపభ్రంశం చెందాయి.అలాగే "మేను" "వేలు" అయ్యిందన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి