బాల్య వివాహం
లేడి పిల్లలా గడిపిన నా బాల్యం
ఒక్కసారిగా ఎవరో లాకున్నట్లు
వయసంటే తెలియని వయసులో
అమ్మ నాన్నలు నీ చేతిలో పెట్టేస్తే
రక్త సంబంధాలను పుట్టినింట వదలి
రిక్తహస్తాలతో కాళ్ళ పారాణి ఆరకముందే
నువ్వెవరో తెలియని నీ తో నడిచ్చోచేసి
నీ చుట్టూ నా జీవితాన్ని అల్లుకున్నపుడే
తెలిసింది..
ఆ నాలుగు గోడలే నా ప్రపంచమని
కట్టుబాట్ల మధ్య కట్టిడి చేయబడుతూ
అనుక్షణం చేసే ఓ అసిత్వ పోరాటమని
గడియారం సెకను ముల్లుతో పోటీపడుతూ
అలుపెరకుండా, ఆగకుండా, అలసట మరచి
ఇల్లంతా బుజాన వేసుకుంటూ
జీతంగా ఓ ఆత్మీయ పలకరింపు కైనా
నోచుకోని నిత్య శ్రామికురాలినేనని
నా శూన్యాలను ఒంటరితనం తో బర్తీ చేసుకొని
నిశ్శబ్దపు దారుల వెంట సాగిపోయే
నిరంతర మౌన ప్రయాణమని
అనుక్షణం వెక్కిరింపుల మధ్య
ఓ సారి
వెనుతిరిగి చూసుకుంటే తెలిసింది
నేను పోగొట్టుకుంది నన్నేనని.!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి