ఏమి నేర్వగలం

చిలుకనో ఉడతనో
చూస్తే నేర్చుకోవచ్చు
కాయ
పండుగా మారేదెప్పుడో
తినగలిగే దెప్పుడోనని

కాకిని చూస్తే తెలుసుకోవచ్చు
కష్ట కాలాన
కలిసుండేదెటులనో
దొరికిందేదో అందరూ కలిసి
పంచుకు తినే దెట్టులోనని

శునకాన్ని చూస్తే తెలుసుకోవచ్చు
విశాల విశ్వంలో
విశ్వాసమంటే ఏమిటో
కాట్లాడుతూ చింపుకున్న
జీవితం ఎంత కష్టమోనని

సింహాన్ని చూస్తే నేర్చుకోవచ్చు
స్థిరచిత్తత, గంభీరత,
కావలసిన దానికంటే
సంపాదన తప్పనీ, అవసరాన్ని
అధిగమించి ఆరాటపడుతూ బ్రతకొద్దని

పికిలిపిట్టనో,పిచ్చుకనో,గువ్వనో,
చూస్తే నేర్చుకోవచ్చు
సామరస్య, సాంఘిక ,క్రమశిక్షణను
శ్రమ జీవన సౌందర్యాన్ని

కానీ......కానీ...!!

తోటి మనిషి నుండి మాత్రం
మతమౌఢ్యపుదౌష్ట్యాలను
అత్యాశల ద్వేషాలను
ఈర్ష్యాధిపత్య, క్రోధాలనే నేర్వగలమేమో..!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం