ప్రయాణం
ఆలోచిస్తే జీవితం ఓ ప్రయాణం.!
ఇదీ గమ్యం అని ఒకటంటూ ఏదీ ఉండదు.
అక్కడక్కడా మజిలీలు ఉంటాయి అంతే. ఈ దారి పొడవునా ఆస్వాదించాల్సింది జీవితమనే ప్రయాణాన్నే.
మనం వెతుక్కోవాలే కానీ ప్రతీ మలుపులోనూ ఓ అబ్బురం దాగుంటుంది.
ఒక్కొ దారిలో ఎన్నో పరిచయాలు,అన్నీ అనుభవాలే.
కొన్ని కలలు,మరికొన్ని కలతలు.
కొన్ని బంధాలు, మరికొన్ని బాధలు
అందరూ సాటి బాటసారులే, కాసేపే కలిసి ప్రయాణించేది.
ఈ ప్రయాణంలో ఒక్కోసారి, ముందెప్పుడూ చూడని కొత్త లోకంలోకి వెళ్తాము.
మరోసారి, మనకు తెలిసిన లోకమే కొత్తగా కనిపిస్తూ ఉంటుంది.
పోతపోసిన విగ్రహాలమై కాక,ఒక్కో రూపం సంతరించుకుంటూ అపురూపమవ్వాలి మనం.
ఏదైనా ఆస్వాదించాలంటే మనలో ఒక స్వచ్ఛత ఉండాలి.
ఈ ప్రయాణంలో హఠాత్తుగా వచ్చే వాన ఆనందం కావచ్చు..ఆందోళనా కావచ్చు.!
ప్రయాణం, ప్రకృతి నేర్పినన్ని పాఠాలు మరెవరూ నేర్పరు. జీవితం పండగ ఆర్బాటం కానేకాదు.!
-అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి