ఓ సృష్టికర్తా
ప్రపంచానికి ఊపిరి పోసిన నీవు
ప్రళయానికి కారణ మవుతున్నావే
జీవ కోటిని కూకటి వేళ్ళతో
పెకలిస్తున్నావే!
ఓ సృష్టి కర్తా సృష్టిని
విలీనం చేస్తున్నావే!
నీ గొప్ప తనాన్ని
జీర్ణించుకోడానికి
ఎన్ని జన్మలు కావాలో
నీలో జఠరాగ్ని ఎంతుందో
ఆకలి వేసిన నీకు ఆహుతి
అవుతున్నదే ఈ లోకం!
కరుణించు మమ్మల్ని
వీక్షించు కరుణా దృష్టితో
మానవత్వం నింపు మాలో
నీ అసమాన ప్రభావంతో
నిర్మల హృదయంతో!!
నీ చేతిలో బొమ్మలం
నీ పాలి బిడ్డలం
వేధించినా
బాధించినా
వెళ్ళలేని పాపలం
చేసుకో మమ్మల్ని
నీ ప్రతి రూపాలుగా
నీ ఆజ్ఞ పాలించే
భృత్యులుగా
నీ దివ్య సందేశాన్ని చాటుతాం
దశ దిశలా
నీ ఘన కీర్తిచాటుతాం
భూలోక భువర్లోక
సువర్లోక మహా లొకాలకు!!
అస్థిత్వం లేని మాకు
నీవేగా ఆధారం
మా జీవాధారం
మా జీవన వేదం
ఘోషించనీ
నీ గొప్ప తనాన్ని
మనసు నిండగా
మా కలలు పండగా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి