ఓ నిరాశా...

ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయినా
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయినా
మనసు మెదడుతో యుద్ధం చేస్తున్న
ఫలితమే ఈ నిదురలేని రాత్రి
అయితేనేమిలే…
పారిపోయిన కాలాన్ని పట్టలేను
నా ముందున్న క్షణాన్ని సరికొత్తగా ప్రారంభించుతా..!!

ఓ నిరాశా…

నీటిని బంధించే వలలల్లగలవా?
గాలిని బంధించడానికి గాలాలు తయారుచేయగలవా?

నేను ఉధృత ప్రవాహాన్ని
చిత్తమొచ్చినట్లు ఉరికే జలపాతాన్ని
నచ్చినట్లు వీచే ఈదురుగాలిని
నన్నిలాగే ప్రవహించనీ…
అనుభవాలను మూటగట్టుకుంటాను
మస్తిష్కాన్ని ఇంకా పదును పెట్టుకుంటాను

వైఫల్యాలను నా వనరులుగా మార్చుకుంటాను
గ్రహణాల బారిన పడినా…
భానుడినై తిరిగి జ్వలిస్తాను!

ఓ నిస్పృహా...

ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం…నాది!!

-అడుసుమల్లి రవి కుమార్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం