ఓ యువకుడా

ఓ యువకుడా......

నీవు దేని గురించి చింత చెందకు,
ఎవరి మనసును నొప్పించకు
నిన్ను నువ్వు అర్థం చేసుకో..
నీవు మన పూర్వీకుల యొక్క కీర్తిని పెంచేలా ఉండు.
నీవు మహానియుడిగా కావడం కోసమే పుట్టావు.
నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీవు భారతీయ సంస్కృతి యొక్క ఉజ్వలమైన తత్వజ్ఞానమును ఒంటపట్టించుకో
ఏదైతే నీ పూర్వికులు చేయలేక పోయినారో అది నీవు చేయాలి.
రాణాప్రతాప్, శివాజీ కూడా నీ శౌర్యాన్ని, పరాక్రమాన్ని చూసి అసూయపడాలి.
వేల సంవత్సరాల నుండి వస్తున్న తత్వజ్ఞానం మరియు ఉత్కృష్టమైన దివ్యమైన సంస్కృతిని నీవు నీ తర్వాతి తరాలకూ అందించాలి.
నిన్ను చూసి కవులు,రచయితలు కూడా ప్రేరణ పొందాలి.
కొన్ని సంవత్సరాల తర్వాత నీవు భౌతికంగా లేకున్నా చరిత్ర పుటల్లో నీకంటూ కొన్ని పేజీలు ఉండేలా జీవించాలి.!

భరతమాత వర్ధిల్లాలి..భరత జాతి వర్ధిల్లాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం