రాయివి కావు....శిల్పానివి
నీ దగ్గర అన్నీ వున్నప్పుడు,
నిన్ను అందమైన శిల్పం అంటారు - పొంగిపోకు!
ఏమీ లేనప్పుడు,
నిన్ను పనికిరాని శిథిలం అంటారు - కృంగిపోకు!
నిజానికి నువ్వు...
ఏ కోణం కొలవలేని వృత్తానివి, ఏ అభిప్రాయానికి చిక్కని అనంతానివి!
చెక్కితే రాయి శిల్పం అవుతుంది, కూల్చితే కొండ శిథిలం అవుతుంది.
నీ భయాన్ని ఎదిరించు
నీ ధైర్యమే, అనంతం అవుతుంది!
మిణుకు మిణుకుమంటూ రోజూ బ్రతుకునీడ్చే
బల్బువే కాదు
అవసరమైతే ఒక్కసారి జివ్వున వెలిగే నిప్పురవ్వవి కూడా.!
న్యూనతల సంకెళ్ళని తెంచుకుని,
సంకల్పం అనే మాలని ధరించు!
సుఖం సంగతి నాకు తెలీదు కానీ,
సంతోషం మాత్రం నిన్ను వెంటాడుతూ వస్తుంది - కౌగిలించుకోమని!
ఇప్పుడో...అప్పుడో...ఎప్పుడో..ఒకనాడు
ఎవడికో నీవు అమాంతం రాయివై పోవచ్చు..కానీ నీకు మాత్రం నీవు ఎప్పటికీ అందంగా నీ ఉలితో చెక్కుకున్న శిల్పానివై ఉండాలి.!
శుభరాత్రి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి