జీవితం

జీవితం....

నిరంతర సంగీతం
అశా నిరాశల కలశం
కాల్పనిక జగత్తులో
నిస్సత్తువ శకటం
గెలుపు ఓటముల
బరిలో మొదలైన విదితం
సర్వరుచుల మిళితం
సంవేదనా భరితం

కష్టాలు కన్నీళ్ళు
నిన్ను కౌగిలించుకొని
నీ కనులకు ఏమీ కనపడనీయకుండా చేస్తున్నవా?
నీ సంకల్పంతో వాటిని
తుడిచి, కనులు కదిలించి చూడు
మరో కొత్త ఆశయం నీ కనుల ముందరే కనిపిస్తుంది....
బాధలు మనుషుల మాటలలో,
వచ్చి నీ మనసును గాయపరచి
నీ మనోస్దైర్యాన్ని మూగపరచేట్లు చేసినవా?
అంతకు మించిన ఆశయ దీక్షతో
విధిని ఎదిరించి వెంటాడు,
విజయం నీ వెనుకాలే నిన్ను వెంబడిస్తుంది.
అదృష్టం అనే అర్హతతో,
లోకం నిన్ను వెలివేస్తున్నదా?
లక్ష్యంకు ఉండవలసినది ఆశే కాని
అర్హత కాదని ఎలుగెత్తి చాటు.....

ఎందుకంటే....
Life Starts from anywhere

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం