ఆది-అంతం
నీకు తెలీకుండా అది వచ్చెళ్లిపోతుంది. కూతకొచ్చిన వాన్ని పట్టివేసే వొడుపుతో.. మల్లయోధునికుండే మహా నేర్పుతో..
డేగ కళ్ళ చూపుతో..
తస్సాదియ్య..ఆనందం.. నువ్వు చూస్తుండగానే వచ్చెళ్లిపోతుంది!
అది నీకు తెలీకుండా వచ్చెళ్ళి పోతుంది, ముమ్మాటికీ అది నీకు తెలీకుండా వచ్చెళ్ళిపోతుంది.!
రేపును గురించి కలలు కనడమూ,
రేపును పట్టి బంధించాలనీ, చెప్పు చేతల్ల్లో ఉంచుకోవాలనీ అనుకోవడమూ,
రేపు, నేడుగా మారిన తర్వాత, అనుకోని పనులలో మునిగిపోయి, అనుకున్న పనులేవీ చేయలేకపోవడమూ, చూస్తుండగానే నేడుగా మారిన రేపు, నిన్నగా అంతరించడమూ...ఈలోగా అది వచ్చి వెళ్ళిపోతుంది.!
గతాన్ని సవరించలేం.
భవిష్యత్తును ఊహించలేం.
వర్తమానం మనిషి చేతిలో లేకుండా పోతున్నది.!
అంతే ఈ లోగా అది వచ్చి వెళ్ళిపోతుంది.!
జీవితానికి సంబంధించి
యాదృచ్ఛికమైన ఆదిలోనూ, అనివార్యమైన అంతంలోనూ
మనిషి ప్రమేయం ఉండదు.
అలాగే ఆద్యంతాల నడిమి జీవితం కూడా, మనిషి స్వేచ్ఛ (స్వ+ఇచ్ఛ)కు అతీతంగానే గడుస్తున్నది మరి.!
అదిగో అది వచ్చి వెళ్ళి పోతోంది.!
శుభరాత్రి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి