నేనో సీసా

విషానికి విషపు రంగు
విస్కీకి విస్కీ రంగు
దాలుస్తుందది...
దానిలోంచి కనిపించేది
నీ ఆకాశమే ననుకుంటున్నావు.
అసలు దాని ఆకాశమే వేరు.
దాని నోటి దగ్గర చెవి పెట్టి చూడు.!
దానిలో నిరంతరం రేగే
గాలిదుమారాల్ని వింటావు...!

ఇంతకీ అదేమంటే.......????

సీసా....కాదు కాదు నేను.....

రకరకాల నవ్వులు అలంకరించుకున్నాను
ఎవరిలానో ఉండాలని..
పనిని బట్టి పులుముకున్న నవ్వు ..
సత్యశోధనకు దొరకదు

పుస్తకాలలోని హావభావాలు
ఇతరుల మస్తిస్కాల్లోని ఆలోచనలు
నా ఆనందం అమ్మివేయబడింది
స్వేచ్చ కంచె వేసుకుంది

కన్నీటికి జాలి లేదు
ఏ సందర్భమైనా ఒకటే స్పందన
కాలం యవ్వనాన్ని దోచేసింది
ఆకులు రాలే సన్నివేశాన్ని చూడలేను

ఊరినుంచి ..నావారి నుంచి ..
మనసు నుంచి.. మమత నుంచి ..
నేను వలస పోయాను ..
నేను ఎక్కడున్నానో నాకే తెలియనంత దూరంగా...!

అందుకే నేనో సీసా....సీసాలో నేను.!
హృదయం విశాలమే.....భావాలే సంకుచితం.!

అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం