నాన్నా..
నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి.
ఏడుస్తూ వుండిపోయాను
తెల్లారే దాకా.
చీకటీ వంతెనా
దిగులు పొలాలూ
ఖాళీ ఆకాశాలూ
అన్నీ నువ్వే.
అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి.....
అయితే ఏం నాన్న నువ్విచ్చిన రెక్కలతో నా 'బిడ్డల' ఆకలి తీర్చగలుగుతున్నా..నీ స్పూర్తి కొనసాగుతుంది.!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి