జీవితం

జీవితం...

ఆశ్చర్యాలతో  నిండిన ఓ మహా సాగరం..

అంతుచిక్కని ఆశలు ఆశయాలు కలగలసిన సముదాయం..

అంచనాలకు అందని ఓ మాయా ప్రపంచం..

అవర్ణనీయమైన పద్మవ్యూహం..

మరు నిమిషాన ఏమి అగునో ఊహించలేని ఓ అసమాన అనివార్యమైన ప్రయాణం.....

"ఒక నిమిషం చెప్పరానంత ఆనందం
మరు నిమిషం చెప్పుకోలేనంత భాధ...."

"ఓ గడియ పొట్ట పగిలేంత నవ్వు
ఆవెంటనే కంట నీరు వరదై పారేలా కష్టాలు..."

"ఒక సమయాన అవకాశాలు వరించే అదృష్టం
మరో సమయాన నవ్వులకి గండి కొడుతూ వచ్చే దురదృష్టం.."

"ఓ క్షణం అన్నీ కలిసొచ్చే సౌకర్యాలు
ఇంకో క్షణం బ్రతుకంటేనే భారం అనిపించే భంగములు..."

"కొన్ని మనసులో ఎప్పుడూ నిలిచిపోయే మధుర సంఘటనలు
మరికొన్ని మనసును ఎల్ల కాలం కంపింపచేసే దుర్ఘటనలు ......"

కేవలం గెలుపోటములు జీవితాన్ని నిర్ణయించలేవు.....
నిజానికి కష్టసుఖములు జీవన విధానాన్ని  మార్చలేవు......

అనుకోకుండా జరిగే సుసంఘటనలు, దుర్గటనలు జీవన ప్రయాణాన్ని ఆపలేవు...
అవస్యం  శుభాశుభములు జీవనాన్ని మహనీయం చేయలేవు.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం