నూతన సంవత్సరం
మానవ జీవన గమనంలో
ఎన్నో తీపి గుర్తులు
మరెన్నో చేదు జ్ఞాపకాలు
ఎన్నో ఉగాదులు
మరెన్నో ఉషస్సులు
సత్యాన్ని విస్మరించక
జీవన తత్వాన్ని తెలుసుకో
హేవళంబి ఎలాగూ వెళ్ళిపోయింది
ఏదో ఒక రోజు నువ్వూ వెళ్ళిపోవాలి
మంచి మనస్సుతో విళంబి ని ఆహ్వానించు
ప్రేమను పంచు,కరుణ ను పెంచు
అసహనాన్ని తుంచు
సహిష్ణుతను పెంపొందించు
ధర్మాన్ని నిలబెడుతూ
జీవనయానం సాగించు
సమస్త మానవాళి
సుఖ సంతోషాలకై ప్రార్ధించు
జయం నీదే....విజయం నీదే
ఇహ పర సాఫల్యం నీదే...నీదే...నీదే.!
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
అడుసుమల్లి రవి కుమార్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి