రేయ్.....నిన్నే
రేయ్....నువ్వొక చెత్త మనిషివిరా..!
నా జీవితంలో ఎక్కడా నీ అంత వరెస్ట్ వాడిని చూడలేదు.
ఈ రోజుకి కష్టమంటే ఏంటో తెలియదు
ఆకలికి తినడం, పోతులా తిరగడం, స్వార్థంగా బతకడం ఇదే కదరా నీ దిన చర్య?
నాకో డౌటూ..! నీ ఉద్దేశంలో
నువ్వు కష్టం విలువను గుర్తించాలి లేదా
అవతలి వారి బ్రతుకు అయినా నీకు తెలిసుండాలి.
ఇవి రెండు కానప్పుడు మీ తాతల తండ్రుల తరాల ఆస్తులైనా నువ్వు అనుభవిస్తూ ఉండాలి అంతే...!
ఇంకెప్పుడురా నిన్ను నువ్వు అర్థం చేసుకునేది.
విను బ్రో, నీతోనే నే మాట్లాడుతున్నది...
నువ్వు నీ సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా?
చుట్టూ ఉన్న వాళ్లను చూసి, వారి కష్టాలను గుర్తించడానికి ఓపిక తీసుకున్నావా?
మీ తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడడం కాదు బ్రో,
నీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు కూడా నీ దారిని సృష్టించుకోవాలి. ఒకవేళ నీకు ఆస్తులు లేవనుకో, అప్పుడు నీ బాధ్యత ఇంకా ఎక్కువ. ఆస్తులను సృష్టించే మార్గాలని నువ్వు వేయాలి.
నువ్వు ఇప్పుడు చేసే ప్రతి పని నీ భవిష్యత్తుకు పునాది.
నువ్వు ఇప్పుడు చెడుగా ప్రవర్తిస్తే, అది రేపు నీకు నిద్ర లేకుండా చేస్తుంది.
నీ దగ్గర సొంత స్వార్థం తప్ప మరే గుణం లేదని అందరూ ఆలోచించక ముందే, నీ అంతరాత్మను నువ్వు నిలదీయ్
"నాకు నిజంగా ఏం కావాలి? నా జీవితానికి అసలైన అర్థం ఏమిటి?"
నీకు కష్టపడటం కష్టంగా అనిపించిందనుకో.. నిన్ను కనడానికి నీ తల్లి పడ్డ పురిటి నొప్పులను గుర్తు తెచ్చుకో, నిన్ను పెంచడానికి పగిలిన నీ తండ్రి పాదాలను గుర్తు తెచ్చుకో! అప్పటికీ నీకు కష్టపడాలనిపించకపోతే..ఎహే చచ్చిపో.
నీ ప్రయత్నాలు ఫలించే రోజు వస్తుంది.
అప్పుడు నీ జీవితానికి గౌరవం చేకూరుతుంది,
నువ్వు అప్పుడు చరిత్రలో నిలుస్తావు.
చివరిగా ఒక మాట చెబుతున్నా,
నీకోసమే కాక నీ తర్వాతి తరాల కోసం కూడా తీవ్రంగా ఆలోచించు, జీవితం విసిరే సవాలును స్వీకరించు! అసలు ముందు నీ కంఫర్ట్ జోన్ ను వదిలేయహే!
ఇంతలా నీకు చెప్పాను అంటే...నేను నీ శ్రేయోభిలాషినే తమ్ముడూ
~ అడుసుమల్లి రవి కుమార్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి