పాములు


 

తస్మాత్ జాగ్రత్త!
పలికే పాములు ఇవి...
నరంలేని ఈ నాగుపాములు కనిపించని మనసునే కాటేయగలవు
లాలాజలాన్ని స్రవించే ఈ రక్తపింజరలు
ఎదుటి మనిషి సృజనను చంపేయగల విషాన్ని చిమ్మగలవు
గుండె ధైర్యాన్ని చిదిమేసే ఈ కొండచిలువలు
కదిలే కొండలైన దవడ గుహల్లో పొంచి ఉండి
ఎదుటివారి హృదయాలను చుట్టి పడేస్తాయి...
అయితే నరుడి నోట్లో నాట్యమాడే పాములన్నీ చెడ్డవే కాదు, ఇందులోనే ఆదిశేషులు, వాసుకిలు కూడా ఉన్నాయి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం