తండ్రీ.!
చిరుగాలి తాకిడికి మువ్వ నవ్విందంటే
సెలయేరు గల గలా సంద్రం వైపు దూకిందంటే
తొలికిరణాల సవ్వడికి ప్రకృతి మేలుకొందంటే
మెరుపుల మేఘాల సందడికి నెమలి ఆడిందంటే
తుమ్మెదల ఝుమ్కారానికి విరులు విరిసాయంటే...
నీ ప్రేమే కారణం కదా శివయ్యా.!
మరి నా తండ్రిని నీలో ఐక్యం చేసుకున్న తరువాత...
ఏమెరుగని స్వచ్చతను చుస్తే నాన్నే గుర్తొస్తారు
అందరిపై సమానంగా కాచే వెన్నెల ను చూస్తే నాన్నే గుర్తొస్తారు
మౌనముని బుద్ధుడి వికసిత నేత్రాలు చూసినా నాన్నే కనిపిస్తారు...
"తండ్రీ" శివయ్యా..
సెలయేరువై నీవు ప్రవహిస్తావు
చిరుగాలిలా నన్ను మురిపిస్తావు
చిరుజల్లువై మదిలో కురుస్తావు
జడివానలా నన్ను ముంచేస్తావు
తొలిమంచులో నీవు కనిపిస్తావు
పూదోటలో నువ్వు వికసిస్తావు
వెన్నలలా నీవు వెలుగిస్తావు
హరివిల్లు నీవై రంగులు విరబూయిస్తావు
కోవెలలో దీపంలా
పెరటిలో పూచేటి మందార పువ్వులా..
నాపై నీ ప్రేమ అవ్యాజ్యమవనీ దేవా.!
🕉️శుభరాత్రి🕉️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి