యాటిట్యూడ్
సమస్త వృక్షాలలో పుష్పాలను వికసింపచేసే ప్రకృతి
నీ దేహంలోని ఆత్మనూ వికసింప చేయదా?
సమస్త లోకాన్ని ప్రకాశింపచేసే సూర్యుడు
జ్ఞానోదయం తో నీ బుద్ధిని ప్రకాశింప చేయలేడా?
సమస్త ధరణికి వర్షాన్ని పంపే మేఘుడు
నీ హృదయం లో పవిత్రతను వర్షింపచేయడా?
సమస్త ఆకాశంలో నక్షత్రాలను ఉదయింప చేసిన విశ్వం
నీ మనసులో మహోన్నత ఆలోచనలు ఉదయింప చేయలేదా?
చీకట్లో వెన్నెల చిత్రాన్ని అందంగా గీసిన దైవం
నీ బాధలలో సంతోషాన్ని విచిత్రంగా పంచడం లేదా?
ఇంద్రధనుస్సును వంచిన నీ దృష్టి
నీ విధి కర్మ లను వంచకపోదా?
విత్తు లో వృక్షాన్ని దాచిన పుడమిలా
నీ హృదయం, నీలో ఓ మహాపురుషున్ని దాచింది.
బీ పాజిటివ్ బ్లడ్ గ్రూపు కాదు,యాటిట్యూడ్.
నీ జీవితం నీతో నువ్వు చేసే సమరం..
ఓడినా గెలుపు నీదే.!
శుభరాత్రి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి