ఆరోగ్య దినోత్సవం

శ్రమతో శారీరక ఆరోగ్యం.. ప్రశాంతతతో మానసిక ఉల్లాసం అందరికీ కలగాలని కోరుకుంటూ

జీవించు ...ఆరోగ్యం గా
జీవిస్తూనే....నీ జీవితం పై
అవగాహన ఏర్పరచుకో
నీ జీవిత పరమావధి ఏమిటి?
పెళ్ళి పిల్లలు
ఆస్తులూ
అంతస్తులూ
సుఖభోగాలూ
ఇవేగా??
వీటి కోసం
ఉరుకులు
పరుగులతో
అలసిపోతున్నావు
ఆశల విష సర్పాన్ని
మెడలో వేసుకున్నావు
నిజ జీవిత సంగీతాన్ని
వినలేని బధిరుడవైనావు.
ఆశల కోసం...
నిత్య సంఘర్షణలలో
సుఖ శాంతులు దూరమై
మానసిక ఆందోళనలతో కాపురం చేస్తున్నావు.....అనారోగ్యం పాలవుతున్నావు.!

జీవితం
ఎత్తైన పర్వత సాణువుల
మద్యన కొండల కోనల నడుమ
పరవళ్ళు తొక్కుతూ
నదిలా
సాగిపోతుంది
సాగరంవైపు....

రాత్రిపూట
ఆకాశంలో నక్షత్రాలు
వెండి పూవులై
నిండినపుడు
తదేకంగా వాటినే చూడు..

అనంతమైన
కడలి కెరటాలు
ఆనంద నాట్యం చేస్తున్నప్పుడు
తదేకంగా వాటినేచూడు....

ఒక మొగ్గ విరియు నప్పుడు
పూవై పరిమళాలు
వెదజల్లేటప్పుడు
తదేకంగా ...
దృష్టి మరల్చకుండా
నాసికతో....
పరిమళాణ్ణి ఆఘ్రాణించు...

అడవిలోన
ఆకాశానికి నిచ్చెన
వేసే మహావృక్షాలను
చూసినపుడు...

అడవి మోదుగలు
గుంపుగ పూచినపుడు...

మయూరాలు
పురి విప్పియాడినపుడు....

చిరుఝల్లులలో
ఆకాశాన....
హరివిల్లు విరిసినపుడు...

తడిసిన రెక్కల
నారబోయు
పావురాల రెక్కల రెపరెపలాడినపుడు...

తొలకరి వానకు
కప్పలు బెకబెకలాడుచు
నాట్యం చేయునపుడు...

గలగల పారే సెలయేరు
నిరంతరం నదీనదాలతో
మమేకమవుతున్నప్పుడు...
నదీనదాలు బిరబిరా
సాగరం వైపు
సాగి పోతున్నప్పుడు....

ఆకుపచ్చని తివాచీ
సోయగాలు పరచిన
ప్రకృతిని తిలకించినప్పుడు....

ఆ నయనానందకర
దృశ్యాలను
మనసున అనుభూతి చెంది
నిలుపుటకు
రెండు కనులు చాలవు
ఆ ప్రకృతిని మనసారా ఆస్వాదించు.!
ఇంకెక్కడ అనారోగ్యం, తోక ముడవదూ.!?

-అడుసుమల్లి రవి కుమార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం