నాన్న
*ఇది...ఓ...నాన్న...కథ*
“నాన్న” అనే ఈ రెండు
అక్షరాల పదం విలువ
అమూల్యం.
నాన్న చనిపోయాక తనని
స్మశానానికి తీసుకెళ్ళే దార్లో...
ఒక చోట నాన్న ని
నేలపై ఉంచి, కొడుకుని
తండ్రి చెవులో నాన్న..నాన్న..
నాన్న అని మూడు సార్లు
పిలవమంటారు.
కొడుకు రెండు సార్లు బాగానే
పిలుస్తాడు,
మూడోసారి
మాట రాదూ.
గుండెలో బాధ, గొంతులో
తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్ళు.
ఎందుకంటే..........
ఆ కొడుకు, తండ్రితో నాన్న అని
పిలిచేది అదే ఆఖరిసారి.
ఇంకెప్పుడు వాడు నాన్నతో
నాన్న అని అనలేడు.......
ఆ పిలుపుకు పట్టేది అరక్షణం మాత్రమే
కానీ...
ఆ అర క్షణంలో వాడికి
మొత్తం కళ్ళముందు కనిపించేది..
మాత్రం...
“స్కూల్ లో
పంఖా కింద కూర్చుని చదువుకోవడం
కోసం నాన్న ఎండలో నిలబడే కష్టం కనిపిస్తుంది.
పిల్లలకి కొద్దిగా జ్వరం వస్తే
అల్లాడిపోయే నాన్న,
తనకి ఎంత పెద్ద దెబ్బ
తగిలిన కూడా హాస్పిటల్
కి వెళ్ళకుండా మన
కోసం దాచిన
డబ్బులు కనిపిస్తాయి.
భోజనం
చేసేటప్పుడు నాన్న తన
కంచంలోని మెత్తని దుంప ముక్కలు తీసి
మన ప్లేట్ లో వేసే మమకారం
కనిపిస్తుంది.
చివరగా ఎవరైనా
నువ్వు ఏం
సంపాదించావు
అని నాన్న ని అడిగితే
నా ఆస్తి నా కొడుకు
అని నాన్న గర్వంగా
చెప్పింది కనిపిస్తుంది “
ఇవ్వన్నీ కనిపించిప్పుడు
నాన్న ని గట్టిగా
హత్తుకుని “నాన్న నాన్న
నాన్న నాన్న నాన్న నాన్న ”అని పిలవాలని
అనిపిస్తుంది.
కాని...అప్పుడు నాన్న
ఈ భూమి నుండి చాలా
దూరంగా...అందనంత
సుదూర తీరాలకు వెళ్ళిపోయి
ఉంటాడు.
నాన్న
ఉన్నప్పుడే తనని
"నాన్న” అని ప్రేమగా
పిలవాలి.
నాన్న చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి.
నాన్న పోయాక తన
ఫోటో దగ్గర కూర్చుని
బాధపడే బదులు....
నాన్న ఉన్నపుడే తనతో
రోజు కొంత టైం
గడుపాలి.
ఆయన పోయాక
ఫేస్ బుక్ లో,వాట్సప్ లో
"నాన్నే నా నాయకుడు”
అని పోస్ట్ లు పెట్టే
బదులు.........నాన్న
ఉన్నప్పుడే నాన్న తో
"నాన్న, నువ్వు నాకు”ప్రేరకుడివి" అని చెప్పుదాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి