కాలం కావడీ

ఎడారిలో ఒయాసిస్సు కోసం
నడి సముద్రం లో గుక్కెడు
మంచి నీళ్ళ కోసం వెతికినట్టు
తననుతాను
వెతుక్కుం టున్న మనిషి బ్రతుకు
కాలం భుజాలపై ‘కావడి’ పయనం
ఊగుతూ తూగుతూ
కావడి కుండలు
ఒకటి ముందు మరోటి వెనక
ఒకటి సంతోషాన్ని
మరోటి దుఖాన్ని మోస్తూ
తూగుటుయాల్లాగా కావడిని కదిలిస్తుంటాయి.
కాలం భుజం మార్చుకున్నప్పుడల్లా
కుండలు ముందు వెనకలవుతుంటాయి.
కావడి కంగారు పడుతున్నా సరే
కనికరం తెలీని కాలం
కదిలి పోతూ కదిలిపోతూ
ఏదో ఒక చోట
కావడిని దించేసి
తన దారిన తాను వెళ్లిపోతుంది.
మట్టిలో కలిసిన
కావడి కుండలు
మళ్ళీ మరొకరి భుజాలపై సిద్ధంగా ఉంటాయి.
ఏనాటికయినా...!

శుభోదయం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వివాహ వార్షికోత్సవం

వలయం

కొత్త సంవత్సరం